telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“నో పెళ్ళి” అంటూ సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, రానా లొల్లి

SBSB

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి (SVCC) బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర థీమ్ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి తొలి పాటను విడుదల చేసారు. “నో పెళ్ళి” అంటూ సాగే పాట‌ని నితిన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. సాంగ్ అద్భుతంగా ఉంద‌ని చెప్పిన నితిన్‌.. నేను చూస్తా ఎన్ని రోజులు ఇలాగే సింగిల్‌గా ఉంటావో,, కొన్ని సార్లు చేసుకోవ‌డంలో టైమ్ గ్యాప్ ఉంటుందేమో కాని చేసుకోవ‌డం ప‌క్కా అంటూ త‌న‌దైన స్టైల్‌లో కామెంట్ చేశాడు నితిన్. నో పెళ్లి అంటూ సాగే ఈ పాట‌లో రానా, వ‌రుణ్ తేజ్ కూడా సందడి చేశారు. మీరు ఈ వీడియో సాంగ్‌ని చూసి ఎంజాయ్ చేయండి.

Related posts