telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

నీటి పుక్కిలింతతో కరోనా టెస్ట్ !

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతున్నప్పటికీ రోజువారీ కరోనా నిర్ధారణ పరీక్షలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 20 లక్షలకు పైగా శాంపిళ్లను పరీక్షిస్తున్నారు. అయితే కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుండి దాని నిర్థారణకు అనేక రకాలుగా టెస్టులు వచ్చాయి..ముఖ్యంగా కరోనా నిర్థారణకు ఆర్టీపీసీఆర్, లేదా స్కానింగ్ పద్దతుల ద్వారా నిర్థారణ చేస్తున్నారు. అయితే పరీక్షలతో ఫలితాలు ఉన్నా అందరికి అందుబాటులో లేని పరిస్థతి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులకు ఆర్టీ పీసీఆర్ టెస్టుల మీదనే ఆధారపడుతున్నారు. మరోవైపు ఈ కిట్ల కొరత కూడ వేధిస్తోంది. ఇక స్కానింగ్ ద్వారా కేవలం పట్టణాల్లోనే వ్యాధి నిర్థారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కరోనాను నిర్థారించేందుకు మరో రకమైన విధానానికి నాగ్‌పూర్‌లోని కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీయల్ రిసెర్చ్‌కు అనుబంధంగా ఉన్న నీరి అనే సంస్థ దీన్ని అభివృద్ది చేసింది. నోటితో ఉప్పునీటిని పుక్కిలించడం ద్వారా కరోనా టెస్టును నిర్ధారణ చేస్తున్నారు. అయితే ఇది చాలా సరళతరంగా ఉండడం త్వరితగతిన ఫలితాలు రావడంతోపాటు పెద్దగా పరీక్షకు సంబంధించిన పరికరాలు కూడ అవసరం లేకుండానే వ్యాధిని నిర్ధారణను మూడు గంటల్లో చేయవచ్చంటున్నారు నిపుణులు. ఈ పరీక్షల కోసం ఐసీఎంఆర్ కూడ అనుమతులు ఇచ్చింది. దీంతో పూణేలో ఈ రకమైన టెస్టులు చేస్తున్నట్టు నీరీ శాస్త్రవేత్తలు తెలిపారు.

Related posts