తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. త్వరలో బిజెపిలో చేరనున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఇప్పుడు విజయశాంతి బీజేపీలో చేరేందుకు అన్ని కసరత్తులు పూర్తయినట్లు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఇటీవల భేటీ కాగా, అంతకు ముందే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండుసార్లు సమావేశమయ్యారు. గత వారం విజయశాంతి ఢిల్లీకి వెళ్లింది. ఆ టూర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి.. ఆయన సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ విజయశాంతి ఆరోజు బీజేపీలో చేరలేదు. అయితే.. తాజా సమాచారం ప్రకారం… రాములమ్మ రేపు బీజేపీలో చేరనున్నారని సమాచారం. ఎన్నికల నేపథ్యంలో రేపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలోనే రాములమ్మ అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీలో చేరున్నారని సమచారం.
previous post
ఆ విషయం అసంతృప్తి కలిగించింది : నీతి ఆయోగ్