telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

చద్ధన్నం తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!

చద్దన్నం అంటే ఎక్కువ మందికి చిన్నచూపు. చద్దన్నం అంటే ఆ ఏం తింటాములే అన్నట్లుంటుంది. రాత్రి పూట మిగిలిపోతే పొద్దున్నే తినేదే చద్దన్నం అన్న సాధారణ అభిప్రాయం. అయితే ఇప్పుడు ఈ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ చద్దన్నం తినాలని చెపుతోంది. 

చద్దన్నం ప్రయోజనాలు…
* అన్నం పులిస్తే ఐరన్, పొటాషియ్, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాల స్థాయి పెరుగుతుంది.
* ఉదా.. రాత్రి 100 గ్రాముల అన్నంలో 3.4 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటే తెల్లారేసరికి 73.91 మిల్లీ గ్రాములు పెరుగుతుందట.. బీ6, బీ12 విటమిన్లు కూడా బాగా లభిస్తాయి.
* శరీరాన్ని తేలికగా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది.
* శరీరానికి అవసరయ్యే బాక్టీరియా బాగా పెరుగుతుంది.
* అధిక వేడితో కడుపులో ఉండే దుష్పలితాలు తగ్గుతాయి.
* పీచు అధికంగా ఉండి మల బద్దకం, నీరసం తగ్గుతాయి.
* బిపి అదుపులో ఉండి, ఆందోళన తగ్గుతుంది.
* దేహాన్ని త్వరగా అలసిపోనివ్వదు. ఎక్కువ సమయం తాజాగా ఉంచుతుంది.
* అలర్జీ కారకాలను, మలినాలను తొలగిస్తుంది.
* పేగుల్లో అల్సర్లను తగ్గిస్తుంది.

చద్దన్నం ఇలా చేసుకోవచ్చు..
* రాత్రి వండిన అన్నాన్ని తెల్లవార్లూ మజ్జిగలో నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు.
* రాత్రి వండిన అన్నాన్ని ఒక చిన్న గినె్నలో తీసుకుని అది మునిగేవరకూ పాలుపోసి నాలుగు మజ్జిగ చుక్కల వేస్తేతెల్లవారేసరికి ఆ అన్నం మొత్తం తోడుకుని పెరుగులాగా అవుతుంది.
* ఈ తోడన్నం లేదా పెరుగన్నానికి తాలింపు పెట్టుకోవటం. ఉల్లిముక్కలకు, టమాటో, క్యారెట్ లాంటివి కలుపుకోవటం చేయవచ్చు.
* ధనియాలూ, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ సమానంగా తీసుకుని మెత్తగా దంచి తగినంత ఉప్పు కలుపుకొని ఒకటి లేక రెండు చెంచాల పొడిని తీసుకొని తోడన్నం లేదా చల్లన్నం నంజుకొని తింటే దోషాలు లేకుండా ఉంటాయి.
* ఎదిగే పిల్లలకు ఇది గొప్ప పౌష్టికాహారం. బక్కచిక్కిపోతున్న వారు తోడన్నాన్ని, స్థూలకాయులు చల్లలో నానిన అన్నాన్ని తినడం మంచిది.
* ఉదయాన్నే తినాలి. ఆలస్యం అయితే మరింత పులిసి కొత్త సమస్యలు వస్తాయి..

Related posts