telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

వేగంగా తింటున్నారా… అయితే మీ పని అయిపోయినంటే !

  • వేగంగా తింటే కలిగే నష్టాలు
    చాలా వేగంగా తినడం వల్ల ఓవర్‌ ఈటింగ్‌ సమస్యకు దారితీస్తుంది. త్వరగా తినడం వల్ల మన శరీరానికి పోషకాలు సరిగా లభించవు. అంతేకాక మనం ఎంతమేర తింటున్నామో కూడా అర్థం కాదు. ఇది ఓవర్‌ ఈటింగ్‌గా మారుతుంది. దీనివల్ల బరువు పెరుగుతాం. ఊబకాయం వల్ల మనల్ని రోగాలు చుట్టుముడతాయి.
    మీరు తొందరగా తొందరగా ఆహారం తినడం వల్ల కడుపు నిండిందా లేక ఇంకా ఏమైనా తినాలా, తినడం ఆపేయాలా అనే సంకేతాలు సరైన సమయంలో మీ మెదడుకు చేరవు.
    వేగంగా తినడం ద్వారా మీరు మీ డైట్‌ ను పక్కాగా అనుసరించలేరు. పైగా బరువు కూడా వేగంగా పెరుగుతుంది. మనం ఆహారం తినేపట్టపుడు సరిగ్గా నమిలి తింటే శరీరానికి సరైన పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఊబకాయం సమస్య అంత త్వరగా మనకు రాదు,.
    ఇదిద జీర్ణవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. తొందర తొందర్లో చాలా మంది ఆహారాన్ని ముద్దలు ముద్దులుగా చేసుకుని ఆరగిస్తారు. కనీసం నమలకుండానే మింగేస్తారు. కొన్నిసార్లు నీళ్లు ఎక్కువగా తాగి భోజనం చేస్తారు. అప్పుడు ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో సమస్యలు పెరిగి అదికాస్తా జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. త్వరగా తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం కూడా ఆకస్మాత్తుగా పెరుగుతుంది. ఆపై ఇన్సులిన్‌ను నియంత్రించలేక సమస్య పెరుగుతుంది. ఇది కాస్తా మిమ్మల్ని డయాబెటిస్‌ వ్యాధి బారీన పడేలా చేస్తుంది.

Related posts