వైసీపీ అధినేత జగన్‌పై ముఖ్యమంత్రి ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. జగన్ నునమ్మితే జైలుకు పంపుతాడని చంద్రబాబు దుయ్యబట్టారు. అవినీతి కేసుల్లో జైలుకెళ్లిన జగన్.. తనతోపాటు అనేక మందిని జైలుపాలు చేశాడని విమర్శించారు. సోమవారం పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్ కరుడుగట్టిన నేరస్థుడు అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేర చరిత్ర ఉన్న పార్టీ అని పేర్కొన్నారు.
ప్రతిరోజూ నేరాలు చేయడం వైసీపీకి అలవాటు అని మండిపడ్డారు. వాటిని కప్పిపెట్టడానికే మరిన్ని నేరాలు చేస్తున్నారని అన్నారు. నేరగాళ్ల ఆలోచనలు నేరాలు-ఘోరాల మీదే ఉంటాయని వ్యాఖ్యానించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కుట్రలు చేసి గెలవాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. చరిత్రలో ఎక్కడ కుట్రదారులు గెలిచిన దాఖలాలు లేవన్నారు. ధర్మాన్ని మార్చడం ఎవరి వల్లా కాదని పేర్కొన్నారు. ధర్మపోరాటంలో టీడీపీ విజయం సాధిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ సర్కార్‌పై రేవంత్ ఫైర్