కలలాంటి ఈ జీవితం
కనుమరుగౌతుందని తెలుసు
కల్పనలాంటి ప్రేమ కవ్విస్తుంది..
ఏదో తెలీని హృదయస్పందన
నీకు ఊరట కలిగిస్తుంది
క్షణికం ఈమాయ
నిన్ను మరిపించి
మురిపిస్తుంది కదా….!!!
దీనికి నీవు ప్రేమ అని
పేరు పెడితే
రేపు అది నిన్ను
వంచనతో వెక్కిరిస్తుంది
తట్టుకునే సహనం దైర్యం
నీ గుండెకి ఉందా ..
పెరిగే నీ వయసు
దాన్ని స్వీకరిస్తుందా ..
అలసిన నీప్రయాణంలో
అలలాంటి అలజడులెందుకు …?
సాగరంలో కెరటాలు
జీవితంలో కష్టాలు
ఆగవు కదా
నేస్తమా నేను నీకు
వ్యతిరేకం కాదు …….
అత్యాచారాలపై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్… ప్రముఖులు ఫైర్