telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మాస్కు లేకుండా తిరిగే వారిపై జగన్ సర్కార్ షాక్

ఏపీలో కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది జగన్ సర్కార్. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మాస్ వేసుకోకుంటే రూ.100 ఫైన్ విధించాలంటూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే స్విమ్మింగ్ పూల్స్ మూసివేతకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. పబ్లిక్ ప్లేసులు.. షాపులు, మాల్స్ వంటి వాటిల్లో భౌతిక దూరం పాటించాలని సూచనలు చేసింది ఏపీ ప్రభుత్వం. సీటింగ్ విషయంలో భౌతిక దూరం పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది.నిబంధనల మేరకు కోవిడ్ ప్రొటోకాల్ అమలయ్యేలా స్థానిక ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఇక ఇప్పటికే కరోనా కట్టడికి ఐదుగురు మంత్రులతో మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కన్వీనర్ గా ఉప సంఘం ఏర్పాటు చేసింది సర్కార్. హోంమంత్రి మేకతోటి సుచరిత, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మెంబర్లుగా ఉప సంఘం ఏర్పాటు అయింది.

Related posts