telugu navyamedia
సినిమా వార్తలు

రష్మిక మందన్న “గీతా… ఛలో…” టీజర్

Rashmika Mandanna images

“ఛలో” సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న వరుసగా హిట్లను అందుకుంటోంది. తెలుగులో ఆమె నటించిన గీతగోవిందం, దేవదాస్ చిత్రాలు మంచి హిట్ ను అందుకున్నాయి. ప్రస్తుతం రష్మిక తెలుగులో విజయ్ దేవరకొండకు జతగా “డియర్ కామ్రేడ్” చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. మరోవైపు రష్మిక నటించిన కన్నడ చిత్రం “గీతా ఛలో” టీజర్ ను విడుదల చేశారు. కన్నడలో “చమ్మక్” అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు రశ్మికకు తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉండడంతో “చమ్మక్” సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక కీలకపాత్రను పోషించింది. రష్మిక 2016లో “కిరిక్ పార్టీ” సినిమాతో శాండల్ వుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts