telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ, అనుష్క కాంబినేషన్ లో మూవీ…!?

Anushka

లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందట. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఒక ఆసక్తికర సబ్జెక్ట్ కోసం విజయ్ దేవరకొండ, అనుష్కను మేకర్స్ సంప్రదించినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. మంచి కథలు, ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తోన్న అనుష్క.. తాజాగా ‘నిశ్శబ్దం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అక్టోబర్ 2న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వినిపించింది. అయితే, ప్రస్తుతం ఈ సినిమాకు మరించ ప్రచారం కల్పించడంలో అనుష్క బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే, ఆదివారం ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు అనుష్క. ఈ ఇంటరాక్షన్‌లో తన రాబోయే చిత్రాల గురించి స్పందించారు. తాను రెండు సినిమాలను అంగీకరించానని, త్వరలోనే అధికారిక ప్రకటనలు వస్తాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ, అనుష్క ప్రాజెక్ట్ ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు ఒక కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. మరోవైపు, విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ సినిమాతో బిజీగా ఉన్నారు.

Related posts