telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ట్రాష్ బ్యాగ్ ఎప్పుడూ నవ్వుతూ మనవెంటే ఉంటాయి… వదిలించుకుంటే మంచిది : పూరి

Puri

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పూరి మ్యూజింగ్స్ పేరుతో తాజాగా ‘ట్రాష్ బ్యాగ్’ పోడ్ కాస్ట్ ఆడియోను విడుదల చేశారు. “ఎడ్మండ్ హిల్లరీ ఎలాగైనా ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నాడు. సో… అందరితో కలిసి ప్లాన్ చేశాడు. 352 మంది పోర్టల్స్, కొంతమంది డాక్టర్లు.. మరో 20 మంది సహాయకులు.. ఆహారం, మిగతా వస్తువులతో కలిసి 4500 కేజీల లగేజీ.. ఇలా మొత్తం నాలుగు వందల మంది బయల్దేరారు. కొంత దూరం వెళ్లాక అందులో కొంత లగేజీ అవసరం లేదనిపించి దాన్ని వదిలేశాడు. బేస్ క్యాంప్ వచ్చేసరికి మరికొంత అనవసరం అనిపించి దాన్ని కూడా పక్కన పెట్టేశాడు. లగేజీతోపాటు మరికొందరిని వెనక్కి పంపించాడు. మోస్తూ నడుస్తుంటే మెల్లమెల్ల‌గా ఏది అవసరమో, ఏది అనవసరమో అర్థమైంది. వాటన్నింటినీ వదిలించుకొని ఫైనల్‌గా అతనొక్కడే ఎవరెస్ట్ ఎక్కాడు. అసలు ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నది అతనొక్కడే. ఈ నాలుగొందల మంది కాదు. అలాగే జీవితంలో నువ్వు అనుకున్న ప్లేస్ చేరుకోవాలంటే అనవసరమైన లగేజీతో బయల్దేరకూడదు. కొండకు తాడు కట్టి దాన్ని పట్టుకొని ఎక్కుతున్నపుడు నీకు నువ్వే బరువు.. దానికితోడు ఇంకొంత మంది నిన్ను పట్టుకొని వేలాడుతుంటే అది సాధ్యమేనా? ఎక్కాలనుకున్నది నువ్వు.. వాళ్ళు కాదు. వాళ్ళందరూ నీకు చేసే సాయం ఏంటో తెలుసా? నిన్ను ఎక్కనివ్వకుండా ఆపడం ఒక్కటే. అందుకే మన చుట్టూ ఉన్న చెత్తను గుర్తించాలి. చెత్త ఎప్పుడూ మనుష్యుల రూపంలోనే ఉంటుంది. అది గుర్తించే సరికి నా జీవితంలో సగం అయిపోయింది. మీరైనా జాగ్రత్తగా ఉండండి. గుర్తుపెట్టుకోండి.. ట్రాష్ బ్యాగ్ ఎప్పుడూ నవ్వుతూ మనవెంటే ఉంటాయి. వాటి మీద ట్రాష్ బ్యాగ్ అని రాసి ఉండదు.. కానీ ఆ ట్రాష్ బ్యాగ్‌ను గుర్తించి ఎప్పటికప్పుడు వదిలించుకుంటేనే నీ సక్సెస్” అని పూరి జగన్నాథ్ తెలిపారు.

Related posts