తెలుగులో సూపర్ హిట్ చిత్రంగా నిలిచి విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ గా మార్చిన “అర్జున్ రెడ్డి”ని బాలీవుడ్‌లో “కబీర్ సింగ్” పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు “అర్జున్ రెడ్డి”కి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ రీమేక్ కు కూడా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. జూన్ 21న విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. ఇందులో షాహిద్ కపూర్ లుక్స్‌తో పాటు నటనతో ఆకట్టుకున్నాడు. కబీర్ సింగ్ గా షాహిద్ కపూర్ నటించిన తీరుకు ప్రేక్షకులతోపాటు సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమాలో షాహిద్ నటనను మెచ్చుకుంటూ షాహిద్‌కి విషెస్ తెలిపారు. వీరిద్దరు ఫోన్‌లో దాదాపు 7 నిమిషాల పాటు మాట్లాడారని తెలుస్తోంది. అయితే షాహిద్ కపూర్, ప్రభాస్‌లకి కామన్ హెయిర్ స్టైలిస్ట్‌గా ఉన్న ఆలిమ్ హకీం వీరిద్దరు కాల్ మాట్లాడేందుకు సహకరించాడు. ఆలిమ్ మాట్లాడుతూ “సాహో” చిత్ర షూటింగ్‌లో ఉన్న నేను ఆన్‌లైన్‌లో “కబీర్ సింగ్” టీజర్‌ని ప్రభాస్‌కి చూపించాను. షాహిద్ నటన ప్రభాస్‌కి ఎంతగానో నచ్చి ఆయనతో మాట్లాడారు. నా ఫోన్ ద్వారా ఇద్దరు సూపర్ స్టార్స్‌ని కలిపాను. ఒరిజినల్ కన్నా బాగా చేశారని షాహిద్‌కి కాంప్లిమెంట్స్ ఇచ్చారు ప్రభాస్ అంటూ ఆలిమ్ హకీం పేర్కొన్నారు.
next post
పెళ్ళికి నన్ను పిలవలేదు… మాజీ ప్రేయసిపై హీరో కామెంట్స్