telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ సింగర్ ని స్టేజ్ పైనే అక్కడ పట్టుకున్నావ్… ప్రముఖ సింగర్

Justin

ప్రముఖ అమెరికన్ సింగర్ జస్టిన్ టింబర్లేక్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల తన కోస్టార్‌తో కలిసి ఓ బార్‌లో కూర్చుని మద్యం తాగుతూ ఆమె చెయ్యి పట్టుకోవడంతో జస్టిన్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో అతను తన భార్యకు పబ్లిక్‌గా సారీ చెప్పుకోవాల్సి వచ్చింది. కాగా 2004లో సూపర్ బౌల్ షోలో జానెట్ జాక్సన్, జస్టిన్ టింబర్లేక్ పాటలు పాడారు. ఆ సమయంలో అనుకోకుండా జస్టిన్.. జానెట్ వక్షోజాలు పట్టుకున్నాడు. ఆ సమయంలో జానెట్ డ్రెస్ చిరిగిపోయింది. దాంతో ఆమె వక్షోజాలు అందరికీ కనిపించాయి. ఆ సమయంలో ఇది పెద్ద రాద్దాంతం సృష్టించింది. ఆ తర్వాత 2018లో జరిగిన సూపర్ బౌల్ షోలో ఈ వివాదం గురించి జస్టిన్ మాట్లాడారు. జరిగిన విషయం గురించి తాను జానెట్‌తో మాట్లాడానని, అన్నీ సర్దుమణిగాయని చెప్పారు. అయితే జస్టిన్ గతంలో చేసిన తప్పుకు గాయని జానెట్ జాక్సన్‌కు సారీ చెప్పలేదంటూ పాత గాయాన్ని గుర్తుచేశారు సింగర్ బెట్టీ మిడ్లీ. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టి వివాదానికి దారి తీశారు. ‘ఓ నటి చెయ్యి పట్టుకున్నందుకు జస్టిన్ టింబర్లేక్ తన భార్యకు క్షమాపణలు చెప్పాడు. కేవలం మద్యం తాగానని, ఆమెతో సెక్స్ చేయలేదని చెప్పాడు. ఇదంతా ఎవరికి అవసరం. మరి అందరూ చూస్తుండగా జస్టి్న్.. సింగర్ అయిన జానెట్ జాక్సన్ వక్షోజాలు పట్టుకున్నాడు. అందుకు ఆయన జానెట్‌కు సారీ చెప్పడా?’ అని ట్వీట్ చేశారు.

Related posts