telugu navyamedia
సినిమా వార్తలు

భీమదేవరపల్లి బ్రాంచి దర్శకుడి లగ్గం !!!

ఇటీవల మైత్రి మూవీస్ ద్వారా విడుదలై మంచి పేరు తెచ్చుకున్న చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి. అలాగే అమెజాన్ ప్రైమ్ లో 200 మిలియన్ వివర్షిప్ సాధించిన ఈ చిత్ర దర్శకుడు రమేష్ చెప్పాల తన తదుపరి సినిమాను ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

ఈ చిత్రంలో ప్రముఖ హీరో, హీరోయిన్ తో పాటు అనేక మంది మంచి టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. జనవరి 16 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

లగ్గం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో దర్శకుడు ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైన్ సబ్జెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాలో వినోదంతో పాటు ఎమోషన్స్, పెళ్లి కల్చర్ ఉంటుంది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించనుంది. పూర్తి వివరాలు త్వరలో.

Related posts