telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

పోలింగ్ రోజునే .. జగన్ ఓటమిని గ్రహించాడు.. : దేవినేని

వైఎస్ జగన్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రమే, తాను ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతానన్న విషయాన్ని దేవుడే నిర్ణయిస్తాడని చెప్పడం ద్వారా తన ఓటమిని అంగీకరించినట్లు అయిందని టీడీపీ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, కోడెలపై దాడికి దిగిన వైసీపీ వర్గీయులు, ఇప్పుడు ఆయనే తన చొక్కాను చించుకున్నారని అంటున్నారని, అటువంటి క్రిమినల్ బుద్ధి ఆ పార్టీ నేతలదే తప్ప తమది కాదని అన్నారు. 
వైసీపీ వస్తే ఘోరం జరుగుతుందన్న ఆందోళన ఓటర్లలో కనిపించిందని, 11వ తేదీన మధ్యాహ్నం తరువాత ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యాన్ని తాను చూశానని, వారంతా టీడీపీకి మద్దతుగా నిలిచారని, అందువల్లే పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు జగన్ అబద్ధాలు చెప్పి వచ్చారని, బీజేపీ సహకారంతో రాష్ట్రంపై కుట్రలు చేయాలంటే చెల్లబోదని హెచ్చరించారు. వీవీప్యాట్ స్లిప్ 7 సెకన్లు కనిపించాల్సి వుండగా, 3 సెకన్లలోనే మాయం కావడం వెనుక ఈసీ హస్తముందని దేవినేని ఆరోపించారు.

Related posts