telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

జగన్  సీఎం అవ్వాలన్నది తన కోరిక: జయసుధ

jayasudha into ycp
వైసీపీ అధినేత  జగన్  సీఎం అవ్వాలన్నది తన కోరిక అని సహజ నటి ఆ పార్టీ నాయకురాలు  జయసుధ  అన్నారు. ఆదివారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో 80 శాతం మంది జగన్ కు మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు. అప్పట్లో వైఎస్సార్ సినీ రంగానికి ఎంతో మేలు చేశారని చెప్పారు.
ఆ కృతజ్ఞతతోనే టాలీవుడ్ లో అత్యధికులు జగన్ పక్షాన నిలిచారని వివరించారు.  సొంతగా పార్టీ పెట్టి ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి జగన్ అని జయసుధ వ్యాఖ్యానించారు. తాము జగన్ పై అభిమానంతోనే ప్రచారం చేస్తున్నామని అన్నారు. మీడియాలో వస్తున్నట్టుగా తమపై కేసీఆర్, టీఆర్ఎస్ ఒత్తిళ్లు ఎంతమాత్రం లేవని స్పష్టం చేశారు.

Related posts