*ఎన్డీఏ అభ్యర్ధిగా ద్రౌపతి ముర్ము నామినేషన్ దాఖలు పూర్తి..
*నామినేషన్ దాఖలు చేసిన ద్రౌపతి ముర్ము..
*నామినేషన్‌ను ప్రతిపాదించిన ప్రధానిమోదీ..
*బలపర్చిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ఎన్డీయే కూటమి తరపున ద్రౌపది ముర్ము(64) రాష్ట్రపతి ఎన్నికలకు శుక్రవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు ముర్ము తన నామినేషన్ పత్రాలు అందించారు.
ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, భాజపా, ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
మొదటగా ముర్ము నామినేషన్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించారు. ఆ తర్వాత నామినేషన్ పత్రాలను 50 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదించి, మరో 50 మంది బలపరిచారు.
అంతకుముందు ఆమె పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు ఆమె నివాళి అర్పించారు. ద్రౌపది వెంట.. బీజేపీతో పాటు మద్ధతు ప్రకటించిన ఇతర పార్టీల ప్రతినిధులు సైతం ఉన్నారు.
ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామమైన బైదపోసిలో సంతాల్ గిరిజన తెగలో 1958 జూన్ 20న ద్రౌపదీ ముర్ము జన్మించారు.
కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.. ఒడిశాలోని రాయరంగాపుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ-బీజేపీ కూటమి ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా పని చేశారు. 2007లో బెస్ట్ ఎమ్మెల్యేగా ఒడిషా అసెంబ్లీ నుంచి నీలకంఠ్ అవార్డు అందుకున్నారామె.
2015 మార్చి 6 నుంచి 2021 జూలై 12 వరకు ఝార్ఖండ్ గవర్నర్‌గా ఆమె పనిచేశారు. జార్ఖండ్‌కు తొలి దళిత మహిళా గవర్నర్‌గానూ పని చేశారు. పైగా దేశ చరిత్రలో ఓ గిరిజన తెగకు చెందిన వ్యక్తి ఓ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైన నేత ఆమె కావడం విశేషం.
ఎన్నికల్లో పోత్తులపై పవన్ తో చర్చలు: కేఏ పాల్