telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు

డిసెంబర్ 27 ఆదివారం దినఫలాలు… ఆత్మవిశ్వాసం, ధనలాభం

మేషం : ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమించి పెండిగ్ పనులు పూర్తిచేస్తారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు వంటివి ఎదుర్కొంటారు. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. రిప్రజెంటేటివ్‌లకు సంతృప్తి కానవస్తుంది. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలలో మెళకువ అవసరం.

వృషభం : ఉద్యోగస్తులు పై అధికారులను నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రాజకీయ నాయకులు పార్టీలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. వైద్యులకు ఆపరేషన్లలో ఏకాగ్రత, మెళకువ అవసరం.

మిథునం : దైవ దర్శనాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మస్థైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. సోదరీ, సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు సదావకాశాలు లభిస్తాయి.

కర్కాటకం : సినిమా, సంగీత, నృత్య కళాకారులకు సన్మానాలు వంటివి జరుగుతాయి. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. స్త్రీలకు టీవీ కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

సింహం : అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. స్థిరాస్తి విక్రయానికి ఆటంకాలు తొలగిపోగలవు. చెప్పుడు మాటలకు ప్రాధాన్యమివ్వడం మంచిదికాదని గ్రహించండి. బ్యాంకుల్లో మీ పనులకు స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తుతాయి.

కన్య : సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసిరాగలవు.

తుల : ముఖ్యమైన వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణాలు చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. స్త్రీలకు అయినవారి ఆరోగ్యం కలవరపరుస్తుంది.

వృశ్చికం : మీ కార్యక్రమాలలో స్వల్ప మార్పులుంటాయి. ఏదైనా వస్తువు కొనుగోలుకు షాపింగ్ చేస్తారు. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. కాంట్రాక్టర్లకు ఏకాగ్రత లోపం వల్ల చికాకులు తప్పవు. రవాణా, ఎక్స్‌పోర్టు రంగాల్లో వారు పనివారివల్ల ఇబ్బందులు గురవుతారు. వ్యాపారాల్లో పోటీని తట్టుకుంటారు.

ధనస్సు : ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనివారితో చికాకులు తలెత్తుతాయి. స్త్రీలకు నరాలు, పొట్ట, కాళ్ళకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఆత్మవిశ్వాసంతో యత్నాలు కొనసాగించడం మంచిది. పెద్దలను ప్రముఖులను కలుసుకుని వారికి బహుమతులు అందజేస్తారు.

మకరం : ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. స్త్రీ మూలకంగా వివాదాలు వస్తాయి. మిత్రులతో కలిసి విందులలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు చికాకులు తప్పవు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో స్వల్ప చికాకులు ఎదుర్కొంటారు.

కుంభం : వృత్తి ఉద్యోగాల్లో తలెత్తిన ఆటంకాలు తొలగిపోగలవు. దైవ, సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు అనుకున్నంత సాఫీగా సాగవు. చేపట్టిన పనులు సక్రమంగా సాగక విసుగు కలిగిస్తాయి. ఖర్చులు అధికం. రుణాలు, చేబదుళ్లు తప్పకపోవచ్చు.

మీనం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనం ఏమాత్రం పొదుపు చేయకున్నా ఆర్థిక ఇబ్బంది అంటూ ఏది ఉండదు. బంధువులను కలుసుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి.

Related posts