telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో లూటీ: ఉత్తమ్

uttam congress mp

తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో లూటీ జరుగుతోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టులన్నీ జేబులు నింపుకోవడానికే అని ఆరోపించారు. ప్రాజెక్టు పనుల నాణ్యత లోపాలపై అన్ని కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. సీఎం ఫామ్ హౌస్ గేటుకు అనుకునే తెగిన కాలువ ఉందన్నారు. కాలువలు తెగుతాయి అనడానికి అధికారులకు సిగ్గుండాలని అన్నారు. అలాంటి అధికారులను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రాజెక్టు పనులను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఉపేందర్ రెడ్డికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని ఉత్తమ్ విమర్శించారు.రూ. 2600 కోట్ల దుమ్ముగూడెం ప్రాజెక్టు టెండర్లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలు దోపిడీ జరుగుతోందని, చీఫ్ సెక్రటరీ కి లేఖ రాశామని తెలిపారు. లేఖపై స్పందించక పోతే ఆయన పాత్ర కూడా అందని భావించాల్సి ఉంటుందని ఉత్తమ్ అన్నారు. మెడిగడ్డ బ్యారేజి పనులను ఎల్ అండ్ టీకి రూ. 2591కోట్లకు ఇచ్చారని, ఆ తర్వాత ప్రాజెక్టు అంచనాలను రూ. 4583 కోట్లకు పెంచారని మండిపడ్డారు.

Related posts