telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

వైకాపా మంత్రులు,ఎమ్మెల్యేల పై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్…

Nara Lokesh

భారీవర్షాలు, వరదలతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. పదేళ్లలో ఎన్నడూ లేని వరదతో పోటెత్తుతోంది. దాంతో లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే ప్రమాదముంది. 18 మండలాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. విజయవాడలో భారీ వర్షాలు లేకపోయినా… కృష్ణా నది నుంచి వస్తున్న భారీ వరదతో… లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుతోంది. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీ దిగువన… పంటపొలాలు, కాలనీలు ముంపు బారిన పడుతున్నాయి. ఇక వరదలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రజలను అదుకోవాల్సింది పోయి ఎం కావాలి రా మీకు? మమ్మల్నే ప్రశ్నిస్తారా?పోండి అవతలకి అంటూ ఛీత్కరించుకొని వెళ్లిపోయారు వైకాపా మంత్రులు,ఎమ్మెల్యేలు. గుంటూరు జిల్లా,వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండలం లంక గ్రామాల్లో పర్యటించిన వైకాపా ప్రజాప్రతినిధుల బృందానికి ప్రజల సమస్యలు వినే ఓపిక కూడా లేకపోవడం దారుణం.ఆదుకోమని అడిగిన పాపానికి అధికార బలుపుతో ప్రజల పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రైతులు, ప్రజలు బిక్కుబిక్కుమంటూ వరద నీళ్లలో ఉన్నారు. ప్రజలని వరదల్లో వదిలేసి ఇంట్లో ఫిడేలు వాయించుకుంటున్న ఆంధ్రా నీరో జగన్ రెడ్డి గారు ఇప్పుడైనా మేల్కోవాలి అని తెలిపారు.

Related posts