telugu navyamedia
క్రీడలు వార్తలు

కెనడా గ్లోబల్ టి20 లీగ్ లో అదరగొట్టిన యువరాజ్

yuvaraj got new opportunities from torento

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన యువరాజ్ సింగ్ కెనడాలో జరుగుతున్న గ్లోబల్ టీ20 లీగ్ లో విజృంభించాడు. ఈ లీగ్ లో టొరంటో నేషనల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న యువీ ఎడ్మంటన్ రాయల్స్ తో మ్యాచ్ లో 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ స్కోరులో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో శివమెత్తాడు.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఎడ్మంటన్ రాయల్స్ 6 వికెట్లకు 191 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో టొరంటో నేషనల్స్ 17.5 ఓవర్లలోనే పని పూర్తిచేసింది. యువీ వేగంగా పరుగులు చేయడంతో టొరంటో జట్టు 13 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.

Related posts