తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈరోజు ట్విట్టర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు. అవినీతి కేసులు తిరగదోడుతారన్న భయంతోనే చంద్రబాబు సైలెంట్ అయిపోయినట్లు ఉన్నారని విమర్శించారు.
టీడీపీ నేతలంతా బీజేపీలో చేరుతున్నా కిక్కురుమనలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని, విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షాకు కోపం వస్తుందేమోనని చంద్రబాబు వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ వదిలివెళుతున్న నేతలను కనీసం నిలువరించే ప్రయత్నం కూడా చంద్రబాబు చేయడం లేదని ట్విట్టర్ లో దుయ్యబట్టారు.
బెంగాల్‌ను కశ్మీర్‌లా మారుస్తున్నారు: ఎంపీ అర్జున్ సింగ్