telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ముద్దు సీన్‌కు సై అంటున్న లావణ్య త్రిపాఠి ?

కథానాయికగా లావణ్యా త్రిపాఠి ‘అందాల రాక్షసి’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘అర్జున్ సురవరం’ తదితర విజయవంతమైన చిత్రాల్లో అందంతో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో ఆమె నటించారు. నటిగా చక్కటి పేరు సొంతం చేసుకున్నారు. దాంతో వైవిధ్యమైన పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నారు. ఒకటి… ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. రెండు… ‘చావు కబురు చల్లగా…!’. ఇది ఇలా ఉండగా… ఈ మధ్య సోషల్‌ మీడియాలో లావణ్య హాట్‌ హాట్‌ ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఇకపై తాను గ్లామర్‌ పాత్రలకు కూడా సిద్ధం అన్నట్లు సంకేతాలు పంచుతోంది. ఈ నేపథ్యంలో సందీప్‌ కిషన్‌ మూవీలో లిప్‌ లాక్‌ సీన్‌లో కూడా నటించారని ప్రచారం జరుగుతోంది. సందీప్‌ కిషన్‌, లావణ్య ఏ-1 ఎక్స్‌ప్రెస్‌ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్‌ కాగా.. లావణ్య హీరో సందీప్‌కి లిప్‌లాక్‌ పెట్టినట్లు ఓ సన్నివేశం ఉంది. మరి ఆ లిప్‌లాక్‌ సీన్‌ ఏ స్థాయిలో ఉంది అనేది పూర్తి సినిమా చూస్తే కానీ తెలీదు. 

Related posts