telugu navyamedia
వార్తలు సామాజిక

వాట్సాప్ లో మరో అద్భుతమైన ఫీచర్!

whatsapp

ప్రముఖ సోషల్ మీడియా ఆప్ వాట్సాప్ ను ప్రస్తుతం భారీ సంఖ్యలో వినియోగిస్తారు. ఐదు నిమిషాలకు ఒకసారి వాట్సాప్ మెసేజ్ లను చెక్ చేస్తుంటారు. రోజువారీ దినచర్య లో వాట్సాప్ మెసేజ్ రాకపోతే కంగారు పడేవాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అంతగా జనాలకు వాట్సాప్ చేరువైంది. తాజాగా మరో అద్భుతమైన ఫీచర్ ను తన వినియోగదారులకు వాట్సాప్ అందించింది. అదే పేమెంట్స్ ఆప్షన్. ఈ ‘పేమెంట్స్’ ఆప్షన్ ద్వారా వాట్సాప్ నుంచి నగదును పంపుకోవడం, స్వీకరించడం చేయవచ్చు.

కొన్ని నెలలుగా ఈ ఆప్షన్ పై వాట్సాప్ ట్రయల్స్ వేసి, చివరకు పేమెంట్స్ ఆప్షన్ ను రిలీజ్ చేసింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ ను బ్రెజిల్ లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. రానున్న రోజుల్లో ఇతర దేశాలకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరింపజేసేందుకు వాట్సాప్ ఏర్పాట్లు చేసుకుంటోంది.ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని వాట్సాప్ యూజర్లు ఉచితంగా వినియోగించుకోవచ్చు. బిజినెస్ పే సర్వీసుకు మాత్రం 3.99 శాతం ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నంబర్ల పిన్ లేదా ఫింగర్ ప్రింట్ ఫీచర్ ద్వారా లావాదేవీలను కొనసాగించవచ్చు. 

Related posts