telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దుబ్బాకలో గెలుపు మాదే : సీఎం కెసిఆర్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానం కోసం ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ అక్టోబరు 9న వెలువడింది. నామినేషన్ల ఉపసంహరణ కూడా ముగిసింది. ఈ ఉప ఎన్నిక నవంబర్‌ 3న పోలింగ్‌ నిర్వహించి.. అదే నెల 10న ఫలితాలు విడుదల చేయనుంది. ఒకవైపు హరీష్ రావు టీఆర్ఎస్ తరపున దూసుకుపోతున్నాడు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ లు గట్టి పోటీని ఇస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దుబ్బాక రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి.  ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికపై సీఎం కెసిఆర్ స్పందించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని సీఎం కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సీఎం కెసిఆర్ ..దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిందని చెప్పారు. మంచి మెజారిటీతో గులాబీ పార్టీ గెలవడం ఖాయమన్నారు. అప్పటివరకు అన్ని తతంగాలు నడుస్తుంటాయని పేర్కొన్నారు సీఎం కెసిఆర్.

Related posts