ఈ రోజుతో బీహార్ ఎన్నికల్లో ఓటింగ్ ముగిసింది… తుది విడత పోలింగ్.. ఇవాళ ఉదయం ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియగా.. అప్పటికే క్యూలైన్లో ఉన్నవారిని ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతి ఇస్తున్నారు అధికారులు.. ఇక, ఎన్నికలకు ముందే కొన్ని సర్వేల ఫలితాలు వెలువడగా… ఓటింగ్ ముగిసిన వెంటనే వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు ఆసక్తిరేపుతున్నాయి.. పీపుల్స్ పల్స్- పీఎస్జీ సంయుక్తంగా నిర్వహించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్-2020లోని కీలక అంశాలను ఓసారి పరిశీలిస్తే.. ఈ ఎన్నికల్లో మహాగట్ బంధన్ (కాంగ్రెస్-ఆర్జేడీ-వామపక్ష కూటమి) కే స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం ఉందని తేల్చేశారు.. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీకి 85-95 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 15- 20, ఎల్‌జేపీ 3-5, వామపక్షాలు 3-5 సీట్లు సాధిస్థాయని.. బీజేపీకి 65-75, జేడీ(యూ) 25-35 సీట్లకే పరిమితం కాగా.. జీడీఎస్ఎఫ్ మరియు ఇండిపెండెంట్లు 5-13 సీట్లు సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్- పీఎస్జీ ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి.. ప్రభుత్వ వ్యతిరేకత చాపకింద నీరులా మారితే మహాగట్ బంధన్ ఇంకా ఎక్కువ సీట్లు సాధించే అవకాశముందని చెబుతున్నారు.. బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా తేజశ్వి యాదవ్ వైపు 36 శాతం, నితీష్ కుమార్ వైపు 34 శాతం మంది ఓటర్లు మొగ్గు చూపినట్టుగా వెల్లడించారు.. ఎన్నికల్లో అత్యధిక ప్రభావం చూపిన సమస్యలు నిరుద్యోగం (31శాతం), ధరల పెరుగుదల (28 శాతం), వలసలు (19 శాతం), వరదలు (12 శాతం), ఎంఎస్‌పీ (9 శాతం) మరియు ఇతర సమస్యలు (1 శాతం)గా వెల్లడించింది పీపుల్స్ పల్స్- పీఎస్జీ.
previous post