ఈ ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే దిగిపోనున్నారు.. అయితే, కొద్ది రోజుల్లోనే పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో.. ట్రంప్ చర్యలపై మాజీ రక్షణ మంత్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలను మార్చే ప్రయత్నాన్ని కొనసాగించొద్దంటూ పదిమంది మాజీ రక్షణ మంత్రులు ఆయనకు సూచించారు. ఇందుకుగాను సైన్యాన్ని వాడాలన్న తలంపు కూడా రానీయొద్దని సలహా ఇచ్చారు. ఈ బృందంలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారు. అగ్రరాజ్య మాజీ రక్షణ మంత్రుల బృందం ఓ బహిరంగ లేఖను రాయగా.. దానిని వాషింగ్టన్‌పోస్టు ప్రచురించింది. ఎన్నికల ఫలితాలను ప్రశ్నించాల్సిన సమయం ముగిసిపోయిందని.. రాజ్యాంగ బద్ధంగా అధికారాన్ని అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్‌కు సూచించారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మొదటని నుంచి అనుమానాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు ట్రంప్.. ఇదే సమయంలో.. ట్రంప్‌కు మద్దతుగా ర్యాలీలు, ఆందోళనకు కూడా కొనసాగుతున్నాయి.
							previous post
						
						
					
							next post
						
						
					

