telugu navyamedia
తెలంగాణ వార్తలు

అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు యత్నం..భారీగా అరెస్ట్‌ లు, లాఠీఛార్జీ

*అసెంబ్లీ వ‌ద్ద ఉద్రిక్త‌త‌..
*కొన్నాళ్ళుగా వీఆర్ ఏలు, గిరిజ‌న పోరాట స‌మితి, టీచ‌ర్లు ఆందోళ‌న‌లు
*ఛ‌లో అసెంబ్లీకి పిలుపునిచ్చిన 7 సంఘాలు.
*త‌మ డిమాండ్లు ప‌రిష్క‌రించాలంటూ టీచ‌ర్ల ఆందోళ‌న‌లు
*అసెంబ్లీ వ‌ద్ద భారీగా అరెస్ట్‌, లాఠీఛార్జీతో ఉద్రిక్త‌త‌

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వీఆర్ఏ‌లు, టీచర్లు ఒక్కసారిగా అసెంబ్లీని ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  

తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి అసెంబ్లీ వైపునకు భారీ సంఖ్యలో దూసుకొచ్చిన వీఆర్ఏలు అసెంబ్లీ ఎదుట బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

పేస్కేల్ అమలు చేయాలని, దీనికి సంబంధించిన జీవోలను విడుదల చేయాలని వీఆర్ఏలు, టీచర్లు నినాదాలతో హోరెత్తించారు . దీంతో పోలీసులు వారిని ఇందిరాపార్క్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద అడ్డుకున్నారు

అసెంబ్లీ వద్దకు వచ్చిన వారిని వచ్చినట్లుగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వారి తాకిడిని నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు.

దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో వారిపై లాఠీ చార్జి చేసి, ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. దీంతో వీఆర్ఏల నుంచి ప్రతిఘటన ఎదురై తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

కాగా..మొత్తం ఏడు సంఘాలు ఈరోజు అసెంబ్లీకి ముట్టడికి పిలుపు నిచ్చారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్డు మొత్తం బ్లాక్ చేశారు.

 

Related posts