వోడాఫోన్ సంస్థ తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతుండటంతో భారత్‌లో సేవలను నిలిపివేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సంస్థ తీవ్రమైన నష్టాల బాట పట్టడం, మార్కెట్ క్యాపిటలైజేషన్.. దిగజారుతుండటం.. నిధుల సమీకరణకు అడ్డంకిగా మారుతుండటంతో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయంలో వోడాఫోన్ సంస్థ అధికారికంగా ఏలాంటి ప్రకటనా చేయలేదు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దాదాపు రూ. 4వేల కోట్లకు పైగా నష్టపోయినట్లు వోడాఫోన్ ప్రకటించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది దాదాపు రూ. 1300 కోట్లు ఎక్కువ.
ఇటీవలే సంస్థ రుణ పునవ్యస్థికరణ చేయాలంటూ వోడాఫోన్ రుణదాతలను కోరినట్టు తెలుస్తుంది. ఈ వార్తలను సంస్థ కొట్టిపారేసింది. రుణ పునర్యవస్థీకరణ కోసం తాము ఎవరినీ సంప్రదించలేదని, ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే చెల్లింపులు చేస్తున్నామని స్పష్టం చేసింది. తాజాగా వస్తున్న వార్తలపై వోడాఫోన్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మహబూబ్నగర్ వలసల జిల్లాగా మారిపోయింది : షర్మిల