telugu navyamedia
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండతో నయనతార ?

Vijay-Devarakonda-with-Nayanatara

పెళ్ళి చూపులు సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డ విజయ దేవరకొండ “అర్జున్ రెడ్డి” సినిమాతో ఓవర్ నైట్ లో సెన్సేషనల్ స్టార్ గా మారిపోయాడు. ఆ తరువాత “గీతగోవిందం, టాక్సీవాలా”తో మళ్ళీ తన సత్తా చాటుకున్నాడు. అంతేకాదు యూత్ లో అమాంతం తన క్రేజ్ ను పెంచేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ “డియర్ కామ్రేడ్” సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. అయితే ఇతర భాషా చిత్రాల్లో నటించడానికీ, అక్కడ మార్కెట్ ను పెంచుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎస్.ఆర్ ప్రభు నిర్మాణంలో ఒక తమిళ సినిమాలో నటించడానికి ఆయన రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ద్వారా ఒక తమిళ యువ దర్శకుడు పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో నయనతార కనిపించనుందని కోలీవుడ్లో బలంగా టాక్ వినిపిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందే ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటించనుందా ? లేదంటే కీలకమైన పాత్రలో కనిపించనుందా? అనే విషయం తెలియాల్సి ఉంది. అసలు ఇందులో నిజమెంత అనేది కూడా తెలియాల్సి వుంది.

Related posts