telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

నవ పారిజాతం!

kalala rani poetry corner
ప్రేమ పారిజాతమా!
చూసిన ప్రతిసారీ
కంటికి తామరాకుపై స్వచ్ఛమైన 
నీటి బిందువులా కనిపిస్తావు
పాలలో కడిగిన ముత్యంలా
అగుపిస్తావు
మనసును గాలిలో తేలే
దూది పింజంలా చేస్తావు
చిరునవ్వులు చిందినప్పుడెల్లా
అధరాల ఆకాశంలో
మిలమిల మెరిసే తారకలా
కనిపిస్తావు
కనువిందు చేస్తావు
ప్రేమ విందు పెడుతావు
–గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు

Related posts