telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వామనరావు దంపతుల హత్యా పై వి. హనుమంతరావు స్పందన…

ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది న్యాయవాది వామనరావు దంపతుల హత్య. అయితే ఈ ఘటన పై స్పందిస్తున్న అందరూ ప్రభుత్వం విమర్శలు చేస్తూనే ఉన్నారు. దానికి కారణం సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు నాడే.. వామనరావు దంపతులు హత్యకు గురయ్యారు.. ఈ హత్యలపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు.. సీఎం కేసీఆర్ పుట్టిన రోజున కేకులతో పాటు మనుషులను కూడా కోశారని విమర్శించారు.. అన్యాయాలను వామనరావు దంపతులు ఎప్పటికప్పుడు ప్రశ్నించారు.. అందుకే వారిని హత్యచేశారని ఆరోపించారు. అన్నింట్లో తెలంగాణ నెంబర్ వన్ అంటున్న కేసీఆర్.. చంపడంలోనూ నెంబర్ వన్ అనే విధంగా ఉందని మండిపడ్డారు వీహెచ్… కేసీఆర్ వల్ల తెలంగాణలోనూ రాయల సీమ సంస్కృతి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నడిరోడ్డు మీద చంపేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వీహెచ్.. అసలు రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందా..? అని ప్రశ్నించారు. ఇక, నయిమ్ కేసు నీరు గారినట్టే ఈ కేసు కూడా చేస్తారు అనే అనుమానాలను వ్యక్తం చేసిన ఆయన.. తక్షణమే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్  చేశారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts