telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్ర‌ధాని మోదీపై ప్రివిలేజ్ మోష‌న్ నోటీసు ఇచ్చిన టీఆర్ఎస్..

దేశ ప్ర‌ధాని న‌రంద్ర మోదీపై స‌భా ఉల్లంఘ‌న నోటీసు ఇచ్చారు టీఆర్ఎస్ ఎంపీలు. రాజ్యసభలో తెలంగాణ‌పై ప్రధాని వ్యాఖ్య‌లు త‌ప్ప‌బ‌డుతూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చారు. తెలంగాణను అవమానించారని ఆ నోటీసులో టీఆర్ ఎస్ ఎంపీలు పేర్కొన్నారు.

తెలంగాణాను అవమానించేలా మాట్లాడారని,  తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్ చేశారని మాట్లాడడం రాజ్యంగ ఉల్లంఘన కిందకు వస్తుందని ఎంపీలు చెబుతున్నారు. ఇది సభ హక్కులను ఉల్లంఘించటమేనంటూ ఎంపీలు స్పష్టం చేసారు. పార్లమెంట్ లో పాసయిన బిల్లును అవహేళన చేయటం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ను ఆ పార్టీ ఎంపీలు కె.కేశవరావు, సంతోష్‌కుమార్‌, సురేశ్‌రెడ్డి, లింగయ్య యాదవ్‌ కలిసి నోటీసు అందజేశారు. 187వ నిబంధన కింద నోటీసు ఇస్తున్నట్లు ఎంపీలు పేర్కొన్నారు.

ఇటీవల రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై తెరాస మండిపడుతోంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ… ఆంధ్రప్రదేశ్‌ విభజన అవమానకరంగా జరిగిందని వ్యాఖ్యానించారు.

 మోదీ చేసిన వ్యాఖ్యలు త‌ప్పుబ‌డుతూ తెలంగాణలో దుమారం సృష్టిస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ ఎస్‌ తో సహా కాంగ్రెస్‌ తీవ్రంగా మండిప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలో మంత్రి కేటీఆర్‌ సహా ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెరాస రాజ్యసభ ఎంపీలు ప్రధానిపై ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చారు.

Related posts