telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఛలో మంథనికి బీజేపీ పిలుపు…

పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన న్యాయవాది దంపతుల హత్యపై రకరకాల కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఊరిలోని గుడి విషయమే హత్యకు కారణమే ప్రచారం సాగుతూ వస్తోంది.. అయితే, ప్రతిపక్షాల మాత్రం ఆ వాదనను కొట్టిపారేస్తున్నాయి.. ఇది ముమ్మాటికే రాజకీయ హత్యేనని.. గుడితో సంబంధమేలేదంటున్నాయి. న్యాయవాది వామన్‌ రావుపై దాడి చేశారు. కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు. అడ్డుకున్న వామన్‌రావు భార్య నాగమణిపై దాడి చేశారు. ఇక నేడు తెలంగాణ బీజేపీ నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. ఇందులో  బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఛలో మంథనికి పిలుపునిచ్చారు. దాంతో రేపు 200మంది న్యాయవాదులతో మంథనికి బీజేపీ లీగల్ సెల్ బయలుదేరనుంది.   న్యాయవాదులతో పాటు మంథనికి బీజేపీ ముఖ్యనేతలు కూడా వెళ్లనున్నారు. ఇందుకోసం రాష్ట్ర కార్యాలయం నుంచి నాలుగు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది బీజేపీ. వామనరావు దంపతుల హత్య పై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఇప్పటికే బండి సంజయ్ డిమాండ్ చేయగా… మంథనిలో వామనరావు కుటుంబానికి లీగల్ సెల్ పరామర్శించనుంది.

Related posts