విశాఖ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంతకు వెళ్లివస్తున్న కొందరు వ్యక్తులు రోడ్డుప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఒడిశా సరిహద్దుల్లోని చింతపల్లి మండలం చెరువూరు గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. గిరిజన ప్రాంతాల్లో ఆదివారం సంతలు నిర్వహిస్తుంటారు.
ఆటోలో చింతపల్లి సంతకు వెళ్లివస్తుండగా, చెరువూరు గ్రామం వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆటోలో ఉన్న ఐదుగురు అక్కడిక్కడే సజీవదహనం అయ్యారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.