telugu navyamedia
రాజకీయ వార్తలు

రేపు సియాచిన్‌ గ్లేసియర్‌ కు వెళ్లనున్న రాజ్‌నాథ్‌

Rajnath Singh inaugurates NIA office

రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్‌నాథ్‌సింగ్‌ రేపు సియాచిన్‌ గ్లేసియర్‌ని సందర్శించనున్నారు. అక్కడ భద్రతా పరిస్థితులను సమీక్షిస్తారు. అక్కడున్న సైనికాధికారులు, జవాన్లతో చర్చించడంతోపాటు వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ కూడా రాజ్‌నాథ్‌తో కలిసి సియాచిన్‌కి వెళ్లనున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రంగా సియాచిన్‌ గ్లెసియర్‌కు పేరుంది.

12వేల అడుగుల నుంచి 23వేల అడుగుల ఎత్తులో భారత్‌ బేస్‌క్యాంప్స్‌ ఉంటాయి. శీతాకాలంలో ఇక్కడ మైనస్‌ 70 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇంతటి క్లిష్ట పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడి తమ సైనికులు రక్షణ విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నరేంద్రమోదీ కూడా సియాచిన్ గ్లేసియర్‌ని సందర్శించారు.

Related posts