అమెరికాలో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడి ప్రజలు జాగ్రత్తలు తీసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. యూఎస్ లో ఇప్పుడు మాస్క్ లకు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ కు కొరత ఏర్పడింది. ఇతరులు వ్యాధితో బాధపడుతూ ఉంటే, తమకు పట్టదన్న సంకేతాలను అమెరికన్లు బయటి ప్రపంచానికి పంపుతున్న పరిస్థితి. నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నిత్యమూ సుదీర్ఘ మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నారు.
అమెరికాలో 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ల నిల్వలు ఉన్నాయని భరోసా ఇచ్చారు. అసలు ఈ ఔషధం కరోనాను పూర్తిగా నియంత్రిస్తుందని ఇంతవరకూ ఎక్కడా నిరూపితం కాలేదు. ఈ డ్రగ్ ను ఇప్పటికే అమెరికాలో సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. ఇప్పుడు కరోనా రోగులకు కూడా ఇది లభించడం లేదన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి ట్రంప్ చెప్పిన విధంగా కరోనా వైరస్ ట్రీట్ మెంట్ కు ఈ డ్రగ్ ను ఎఫ్డీఏ ఇంతవరకూ ఆమోదించలేదు.
ఇప్పుడు అమెరికాలో అవసరం ఉన్నా, లేకున్నా, మలేరియా చికిత్సలో వాడే ఔషధానికి ఎనలేని డిమాండ్ వచ్చి పడింది. ఇక యూఎస్ సమస్య లో మాస్క్ లు అందుబాటులో లేకపోవడంతో ఎక్కడ కనిపించినా, అక్కడికి చోరులు వాలిపోతున్నారు.
అమెరికాలో ఇప్పుడు రాష్ట్రాల మధ్య కూడా పోరు సాగుతోంది. చైనా 1000 వెంటిలేటర్లను పంపినా, వాటి అవసరం ఎంతో ఉన్న న్యూయార్క్ నకు చేరలేదు. న్యూయార్క్ కు వెంటిలేటర్లు చాలినంతగా రాకపోవడానికి కూడా ట్రంపే కారణమని ఈ ప్రాంతంలోని అమెరికన్లు ఆగ్రహంతో ఉన్నారు.