అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటమి భయంతోనే జగన్ పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. “పంచాయతీ ఎన్నికల సందర్భంగా అచ్చెన్నాయుడి గారి అరెస్ట్ రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ట. నిమ్మాడలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే జగన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారు. నిమ్మాడలోని అచ్చెన్నాయుడు ఇంటిపైకి రాడ్లు, కత్తులతో దాడికి వెళ్ళిన వైకాపా నేత దువ్వాడ శ్రీనివాస్, అతని అనుచరులపై పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చెయ్యలేదు.నిన్న తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట మండలం, గొల్లలగుంట గ్రామంలో టిడిపి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి పుష్పవతి గారి భర్త శ్రీనివాసరెడ్డిని హత్య చేసారు.ఈ రోజు అచ్చెన్నాయుడి గారిని అరెస్ట్ చేసారు.ఎన్ని కుట్రలు చేసినా పంచాయతీ ఎన్నికల్లో నియంత జగన్ రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం.” అంటూ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
previous post