వెళ్లిపోమాకే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అలియాస్ విశ్వక్ సేన్ 2018లో విడుదలైన ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. తరువాత ఏడాది ఫలక్‌నామా దాస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా గుర్తింపు పొంది విశ్వక్ వెంటనే పోలీస్‌గా థ్రీల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఔరా అనిపించాడు. హిట్ సినిమాతో అతడికి భారీ గుర్తింపు వచ్చింది. అయితే ఇటీవల విశ్వక్ తన నూతన సినిమాను తెరకెక్కించనున్నాడు. తమిళ్‌లో సూపర్ హిట్ అందుకున్న ‘ఓ మై కడవులే’ సినిమా తెలుగు రీమేక్‌లో చేసేందుకు సిద్దమయ్యాడు. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నరేష్ కుప్పిలి అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్‌లను అందించాడు. ఈ చిత్రం రీమేక్‌కు కావలసిన రైట్స్‌ను పీవీపీ సినిమాస్ సొంతం చేసుకుంది. తాజాగా పాగల్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో విశ్వక్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఏప్రిల్ 30న చిత్రాన్ని థియేటర్లలో విడుదల కానుంది.