telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తల్లికాబోతున్న హీరోయిన్ అనీషా ఆంబ్రోస్

ambrose

పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటించిన ‘గోపాల గోపాల’ సినిమాలో జర్నలిస్టు పాత్రలో కనిపించిన అనీషా ఆంబ్రోస్ తల్లికాబోతోంది. ఈ విషయాన్ని మరో నటి తేజస్వి వెల్లడించింది. తన ఫ్రెండ్ తల్లి కాబోతోన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఇటీవల బయటపెట్టింది తేజస్వి. అనీషా గర్భాన్ని ఆమె భర్త గుణ జక్క ముద్దాడుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా తేజస్వి పెట్టింది. ఇదే విషయాన్ని అనీషా టైమ్స్ ఆఫ్ ఇండియాకు వెల్లడించింది. ఈ విషయాన్ని కాస్త రహస్యంగా ఉంచుదామని మేం అనుకున్నాం. కానీ, మా ప్రైవేట్ అకౌంట్‌లో ఫొటోను చూసిన తేజు ఆనందాన్ని ఆపులోకేపోయింది. వెంటనే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరికీ షేర్ చేసేసింది అని అనీషా తెలిపింది. మనకు సెలబ్రిటీ ఫ్రెండ్స్ ఉంటే, వాళ్లను ఆపడం మన వల్ల కాదని.. ఏమీ చేయలేమని నవ్వుతూ చెప్పింది. ప్రస్తుతం తనకు ఐదో నెల అని అనీషా వెల్లడించింది. కాగా, విశాఖపట్నంకు చెందిన అనిషా ఆంబ్రోస్ గీతమ్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్‌లో బిజినెస్‌లో ఎంబీఏ చేసింది. అయితే, మోడలింగ్‌ మీద ఆసక్తితో దాన్నే తన కెరీర్‌గా ఎంపిక చేసుకుంది. ఆ తరవాత సినిమాల వైపు మళ్లింది. ఇదిలా ఉంటే, హైదరాబాద్‌లోని ఓ ప్రోపర్టీ మేనేజ్‌మెంట్ కంపెనీలో మార్కెటింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న గుణ జక్కతో 2018 డిసెంబర్‌లో అనీషా నిశ్చితార్థం జరిగింది. కిందటేడాది మే 31న వీరి వివాహం జరిగింది.

Related posts