telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తాం..

కేంద్ర ప్ర‌భుత్వం స‌హాకారంతో జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పనులను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప‌రిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరులో నిర్మించిన పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణాన్ని వీక్షించారు.

ఈ సంద‌ర్భంగా నిర్వాసితులతో కేంద్ర మంత్రి షెకావత్  మాట్లాడారు. .పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పూర్తి చేస్తాయని షెకావత్‌ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు జీవనోపాధికి, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

పోలవరం పునరావాస కాలనీలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించిన సీఎం వైఎస్ జ‌గ‌న్ నుకేంద్ర మంత్రి అభినందించారు. నిర్వాసితుల సమస్యలపై తాను సీఎం జగన్ తో చర్చించామన్నారు. పునరావాస కాలనీలో నిర్మాణాలు నాణ్యంగా ఉండాలని ఆయన కోరారు.

మరో వైపు నిర్వాసితులకు జీవనోపాధిని కల్పించాలని,  వ్యవసాయంతోపాటు ఉపాధి దొరికేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తైన తర్వాత తాను మరోసారి ఇక్కడికి వస్తానని కేంద్ర మంత్రి షెకావత్ తెలిపారు.

Related posts