telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పోలవరం పూర్తయితేనే ఏపీ సస్యశ్యామలం అవతుంది..

పోలవరం నిర్వాసితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు పునరావాస కాలనీలను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కలిసి ఆయన శుక్రవారం సందర్శించారు.

ఇందుకూరుపేటలో ఆయన నిర్వాసితులతో మాట్లాడారు.. పోలవరం నిర్వాసితులకు కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా నిర్వాసితులకు సాయం చేస్తుందని జగన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు లక్షలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో మూడు లక్షలు అదనంగా ఇస్తుందని చెప్పారు. వారి జీవనోపాధిపై కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.

Image

ఆంధ్రప్రదేశ్ కు పోలవరం జీవనాడి అని అన్నారు. పోలవరం పూర్తయితేనే ఏపీ సస్యశ్యామలం అవతుందన్నారు.నిర్వాసితులకు స్థానికంగానే జీవనోపాధి కల్పించడం ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి సాధిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరించారు. మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు స్థానికులకు నైపుణ్య శిక్షణ కూడా అందిస్తామని జగన్ తెలిపారు.

Related posts