telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

స్పీకర్ ఫార్మాట్ లో గంటా రాజీనామా…

Ganta srinivas tdp

ఏపీలో ప్రస్తుతం పంచాయితీ ఎన్నికలతో పాటుగా విశాఖ స్టీల్‍ ప్రయివేటీకరణ కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రయివేటీకరణ వ్యవహారం బహిర్గతం అయిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా గంటా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ డం ద్వారా ఉక్కు పోరాటానికి ఊపు తీసుకుని వచ్చారు. అయితే ఈనేపథ్యంలో గంటా రాజీనామాపై రాజకీయ వి మర్శలు వినిపించాయి. భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయంగా కొందరు… ఎత్తుగడగా మరికొందరు అభివర్ణించారు. ఐతే, గంటా మాత్రం తన చిత్తశుద్ధి ని నిరూపించుకోవడం కోసం నేరుగా కార్మిక సంఘాల నిరసన దీక్షల సాక్షిగా మరోసారి రాజీనామా చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని ఇంత కంటే పెద్ద త్యాగానికి రెడీగా వున్నానని ప్రకటించారు. తన రాజీనామాను రాజకీయం చేస్తున్నారని భావిస్తున్న గంటా…వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కీలకంగా వ్యవహరించాలని నిర్ణయించారు. నిబంధనలకు అనుగుణంగా గంటా రాజీనామా స్పీకర్ కు చేరితే జిల్లాలోని అధికార, విప క్ష ఎమ్మెల్యేలపైన ఒత్తిడీ ఓరేంజ్ లో వుండే అవకాశం వుంది. చుడాలి మరి ఏపీలో ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts