కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పేద ప్రజలకు ఉచితంగా రేషన్ సరుకులను అందించబోతోంది. మే, జూన్ నెలల్లో ఉచితంగా ఆహార ధాన్యాలను పేదలకు అందజేయాలని నిర్ణయించింది కేంద్రం. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తారు. మోడి ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, దేశ వ్యాప్తంగా సుమారు 80 కోట్ల మంది లబ్దిదారులకు ఉచితంగా 5 కేజీల చొప్పున ఆహార ధాన్యాలను అందజేస్తారు. కరోనా మహమ్మారి విలయం నేపథ్యంలో అమలు చేయబోయే ఈ పథకం కోసం రూ . 26 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది ప్రభుత్వం.
previous post
next post