telugu navyamedia
రాజకీయ

ఉక్రెయిన్ ఎదురుదాడి : ర‌ష్యా జెట్ ఫైట‌ర్‌ కూల్చివేత‌

*ర‌ష్యా దూకుడుతో అప్ర‌మ‌త్త‌మైన ఉక్రెయిన్‌
*రష్యా దాడి నుంచి ఉక్రెయిన్ కాపాడుకుంటామన్న అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు..

రష్యా దాడులతో అప్రమత్తమైన ఉక్రెయిన్‌ ఎదురుదాడి దిగింది. రష్యాకు ధీటుగా భారీగా బలగాలను మోహరించి కీలక ప్రాంతాల్లో తిరుగుబాటు మొదలు పెట్టింది.

త‌మ దేశంలోని ప్ర‌వేశించి దాడుల‌కు దిగుతున్న రష్యా ఫైటర్‌ జెట్‌ను ఉక్రెయిన్‌ బలగాలు కూల్చివేశాయి. ఈ మేరకు  5 రష్యా విమానాలు, హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు కూల్చేశామని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. తమ దేశ భ‌ద్ర‌త కోసం సైనికులు పూర్థి స్థాయిలో పోరాడ‌తార‌ని ఉక్రెయిన్ ప్ర‌భుత్వం తెలిపింది.

మ‌రోవైపు ..రష్యా దాడులు నుంచి తమ దేశాన్ని, ప్రజలను కాపాడుకుంటామంటామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. అటు, ఉక్రెయిన్‌ ఎయిర్‌స్పేస్‌ మూసేయడంతో విమానాల రాకపోకలకు బ్రేక్‌ పడింది. దాంతో, ఉక్రెయిన్‌లో వేలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండటంతో భారతీయుల భద్రత ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు.

Related posts