telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

భారత్ లో మరో రెండు కొత్త కరోనా కేసులు…

sankranthi holidays in telangana

యూకే లో వచ్చిన కొత్త కరోనా వైరస్.. భారత్‌లో ఎంట్రీ ఇవ్వడంతో అలజడి రేపుతోంది. దేశంలోకి ఎట్టి పరిస్థితుల్లో ఈ కొత్త వైరస్‌ను రాకుండా చూడాలని ప్రభుత్తం చేపడుతోన్న చర్యలకు బ్రిటన్‌ నుంచి భారత్‌కు వస్తోన్న విమానాలు ఆటంకంగా మారతున్నాయి. తాజాగా బ్రిటన్ నుంచి భారత్‌కు చేరకుకున్న విమాన ప్రయాణికుల్లో 20 మందికిపైగా కరోనా పాజిటివ్ తేలడంతో అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు యూకే నుంచి వచ్చిన ప్రయాణికులకు కొవిడ్‌ టెస్ట్‌లు చేయిస్తున్నారు. ఇక, అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తం అయ్యాయి… ఈ మధ్య కాలంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను ట్రెసింగ్ చేసే పనిలోపడిపోయారు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.. తాజాగా విదేశాల నుంచి మరీ ముఖ్యంగా యూకే నుంచి వచ్చినవారిన గుర్తించి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.. అయితే. విదేశాల నుంచి వచ్చిన వాళ్లలో ఇప్పటికే ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. మరికొంతమంది ప్రయాణికుల కోసం ట్రెసింగ్ కొనసాగుతోంది.. మరోవైపు.. పాజిటివ్ వచ్చిన వాళ్లలో ఉంది లోకల్ కరోనా నా..? లేక కొత్త రకమా..? అనే అనుమానులు ఉండడంతో… జీన్ మ్యాప్ కోసం పాజిటివ్ పేషేంట్ల శ్యాoపిల్స్ ను సీసీఎంబీకి పంపించారు వైద్యాధికారులు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts