telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేసీఆర్ ఢిల్లీ టూర్ అడ్డం తిరిగింది : బండి

ఖమ్మం తో పాటు వరంగల్, సిద్దిపేట లకు చెందిన తెరాస నేతలు బీజేపీ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నాడు. దుబ్బాక లో ఓడిన తెరాస ముఖ్య నేతల్లో, మంత్రుల్లో  అహంకారం,స్వార్థం తగ్గలేదు. తక్కువ సమయంలో గ్రేటర్ ఎన్నికలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మేయర్ ఎన్నిక ఎందుకు నిర్వహించడం లేదు.. మేయర్ ఎన్నిక మీతో అవుతుందా కాదా అని ప్రశ్నించారు. మా కార్పొరేటర్ లకు 5 కోట్లు 10 కోట్లు ఇస్తాము రమ్మని అడుగుతున్నారు. ఇంకా తెరాస బిచ్చపు బతుకు మానుకోలేదు అని అన్నారు. అయితే తెరాస కార్పొరేటర్ లు వస్తామని చెప్పిన మేము వద్దని చెబుతున్నాం అని అన్నారు.  మమ్మల్ని గెలికితే మేము గెలుకుతాం. కొందరు పోలీస్ అధికారులు తెరాస నేతల్ల మాట్లాడుతున్నారు.. ఐపీఎస్ వ్యవస్థ ను సీఎం అవమానిస్తుంటే పోలీస్ అధికారులు సంఘం ఎందుకు మాట్లాడడం లేదు అని అడిగారు. 

కేసీఆర్ ఢిల్లీ టూర్ అడ్డం తిరిగింది.. అందుకే పోయి ఫార్మ్ హౌస్ లో పడుకున్నాడు. బీజేపీ లో చేరేందుకు వస్తున్న ఖమ్మం వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేశారు.. మీకు వ్యాపారాలు ఉన్నాయని బెదిరించారు కొత్తగూడెం జిల్లాలో ఒక స్కూల్ హెడ్మాస్టర్ 5 గురు మైనర్ బాలిక లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ పోలీస్ లు పట్టించుకోలేదు. గిరిజన బాలికల పై అకృత్యం చేసిన నిందితుడిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంత పెద్ద సంఘటన ని చిన్నది గా చూపించే ప్రయత్నం తెరాస నేతలు చేస్తున్నారు అని ఆరోపించిన ఆయన తెలంగాణ పోలీస్ లు హీరో లు అని పేర్కొన్నారు. నిజాయితీ గా వ్యవహరించే పోలీసులకు 15 నిమిషాలు అప్పగించు… సంఘ విద్రోహ శక్తులను , రోహింగ్యాల ను జల్లడపడతారు అని అన్నారు. సీఎంకి దమ్ము ఉంటే అపని చేయి .. తెలంగాణ పౌరుషం ఉంటే పోలీస్ లకు అధికారం ఇవ్వు… మేము మేయర్ గా గెలిస్తే పోలీసులకు పాత బస్తి అప్పగించాలని అనుకున్నాం. రేపు అటల్ జయంతి సందర్భంగా రైతుల అకౌంట్స్ లో కిసాన్ సమ్మాన్ నిది కింద డబ్బులు పడుతాయి. రేపు కోటి మంది తో మోడీ మాట్లాడబోతున్నారు. తెలంగాణ లోని అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాట్లు చేశాం వ్యవసాయ చట్టాల పై మోడీ వివరిస్తారు. రేపు 11 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుంది అని అన్నారు.

Related posts