telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్..ఇద్దరు మావోల హతం

Two moists killed encounter vishakha

చత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులో ఇధ్దరు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా పామేడ్ అటవీప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు నిఘావర్గాలు సమాచారం అందించాయి. దీంతో తెలంగాణకు చెందిన గ్రేహౌండ్స్ బలగాలు, ఛత్తీస్ గఢ్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు.

పోలీసుల కదలికలను పసిగట్టిన మావోలు కాల్పులు జరుపుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోలు మృతి చెందారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోల కోసం పోలీసులు కూంబింగ్ ను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఎప్పుడేమీ జరుగుతుందోనని పరిసర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Related posts