telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

టెలికాం సంస్థ‌ల‌పై సుప్రీంకోర్టు సీరియ‌స్

Supreme Court

టెలికాం సంస్థ‌ల‌పై సుప్రీంకోర్టు సీరియ‌స్ అయ్యింది. టెలి సంస్థ‌లు సుమారు 1.5 ల‌క్ష‌ల కోట్ల బాకీ చెల్లించ‌క‌పోవ‌డాన్ని సుప్రీం త‌ప్పుప‌ట్టింది. భార‌తీ ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌, ఎంటీఎన్ఎల్‌, బీఎస్ఎన్ఎల్‌, రిల‌య‌న్స్ కమ్యూనికేష‌న్స్‌, టాటా టెలిక‌మ్యూనికేష‌న్స్ సంస్థ‌ల‌కు సుప్రీం స‌మ‌న్లు జారీ చేసింది. ఆయా కంపెనీలు కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డిన‌ట్లు సుప్రీం పేర్కొన్న‌ది. మార్చి 17వ తేదీ ఆ కంపెనీల డైర‌క్ట‌ర్లు కోర్టు ముందు ప్ర‌త్య‌క్షంగా హాజ‌రుకావాలని ఆదేశించింది.

ఎన్ని ఆదేశాలు ఇచ్చినప్పటికీ టెలికాం కంపెనీలు చ‌లించడం లేద‌ని జ‌స్టిస్ అరుణ్ మిశ్రా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త్రిస‌భ్య‌ ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారిస్తున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏజీఆర్‌కు సంబంధించిన బాకీల నుంచి టెలికాం కంపెనీలు న‌యా పైసా కూడా చెల్లించ‌లేద‌ని జ‌స్టిస్ మిశ్రా అన్నారు. టెలికాం సంస్థ‌ల బాకీల గురించి త‌న‌ను అడ‌గాల్సిన అవ‌స‌రం లేద‌ని టెలికాంశాఖ అధికారి అటార్నీ జ‌న‌ర‌ల్‌కు రాసిన లేఖ‌ను కోర్టు తీవ్రంగా త‌ప్పుప‌ట్టింది.

Related posts