పద్మావతి విచారణ కార్యాలయం వద్ద బస్సులకు ప్రత్యేక పూజలు చేసి జెండాను ఊపిన వెంకయ్య చౌదరి.
ఏపీఎస్ఆర్టీసీ సంస్థ 20 విద్యుత్ బస్సులను తిరుమలలో రోజువారీగా తిప్పేందుకు అంగీకరించారు అన్నారు.
రెండు నెలలగా టీటీడీ ఏపీఎస్ఆర్టీసీని కోరుతున్నాం ఏపీఎస్ఆర్టీసీ సంస్థ త్వరగా అంగీకారం తెలిపారు.
తిరుమల అన్ని ప్రాంతాల్లో 20 విద్యుత్ బస్సులు 80 ట్రిప్స్ తిరుగుతాయి టీటీడీ నడిపే 12 ఉచిత బస్సులు ప్రతి 8 నిమిషాలకు బస్ స్టాప్ దగ్గరకు వస్తాయి.
ఈ ఆర్టీసీ బస్సులు వద్ద 8 నిమిషాల కూడా వేచి చూడాల్సిన అవసరం భక్తులకు లేదు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అభివృద్ధి చెందుతుంది.
ఈ బస్సులు వల్ల భక్తులు తిరుమలలో ఏ ప్రాంతమైన తిరుపతికి వెళ్లాలంటే సులభంగా వెళ్ళవచ్చు, తిరుమల తిరుపతికి వెళ్ళే బస్సు చార్జీలు మాత్రమే ఉంటాయి అని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు.


